కాన్సర్ బాధిత విద్యార్థికి ఆర్థిక సాయం

SKLM: సంతబొమ్మాలి మండలం దండుగోపాలపురం, జడ్పీ.హెచ్.యస్‌లో 7వతరగతి చదువుతున్న మండల వేణు అనే విద్యార్థి బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం పాఠశాల విద్యార్థులు స్పందించి తమ సహచర విద్యార్థిని ప్రాణాపాయము నుంచి కాపాడుటకు తమవంతుగా రూ.12100 పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిట్ట.గంగన్న చేతుల మీదుగా గురువారం విద్యార్థి తల్లిదండ్రులకు అందజేశారు.