విద్యార్థికి రివార్డు అందించిన కలెక్టర్

విద్యార్థికి రివార్డు అందించిన కలెక్టర్

ప్రకాశం: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచిన పర్చూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి షేక్ సమీరాను సోమవారం జిల్లా కలెక్టర్ వెంకట మురళి అభినందించారు. అనంతరం తనకు రూ.10 వేల ప్రైజ్ మనీ అందించారు. సమీరాను ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆయన కోరారు.