అడవి పందుల బీభత్సం.. అన్నదాతల ఆవేదన

అడవి పందుల బీభత్సం.. అన్నదాతల ఆవేదన

MDK: రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామ రైతులు అడవి పందుల బెడదతో విలవిలలాడుతున్నారు. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న పంటలు కళ్ళముందే నాశనమవుతుంటే ఏం చేయాలో దిక్కుతోచక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని సాగు భూముల్లోకి రాత్రి సమయాల్లో అడవి పందుల గుంపులు చొరబడి, ఎకరాల కొద్దీ జొన్న పంటను తొక్కివేస్తూ, తినేస్తూ ధ్వంసం చేస్తున్నాయి.