నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
KDP: బద్వేలులో నేడు ఉదయం 8.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. శ్రీనివాసపురం, గానుగపెంట, పి.పి.కుంట 33/11కేవ్ సబ్ స్టేషన్లలో మరమ్మత్తు పనులు చేపట్టనున్నందున ఈ అంతరాయం ఉంటుందని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ M.కుళాయ్యప్ప, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ T.శివకుమార్ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలన్నారు.