రైతు సమస్యల పరిష్కారం ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

రైతు సమస్యల పరిష్కారం ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

SKLM: రైతు సమస్యల పరిష్కారం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని రాష్ట్ర మంత్రి అచ్చెన్న నాయుడు అన్నారు. రాష్ట్రానికి 24,894 మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించినట్లు మంత్రి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేటాయింపు సీఎం చంద్రబాబు చొరవ ఫలితమే అని పేర్కొన్నారు. ఈ నెల 15 నుండి 22 మధ్యలో విశాఖపట్నం పోర్టుకు యూరియా చేరుకోనుందని వెల్లడించారు.