అభివృద్ధికి ఓటు వేయండి: మాజీ ఎమ్మెల్యే

అభివృద్ధికి ఓటు వేయండి: మాజీ ఎమ్మెల్యే

KMM: అభివృద్ధి చేసిన వారికి ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కూసుమంచి మండలం నేలపట్లలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆయన విమర్శించారు.