గంగారం బెటాలియన్‌లో పంద్రాగస్ట్ వేడుకలు

గంగారం బెటాలియన్‌లో పంద్రాగస్ట్ వేడుకలు

KMM: గంగారంలోని 15వ ప్రత్యేక పోలీసు పటాలంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమాండెంట్ పీజేపీసీ. చటర్జీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహనీయుల త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్య్రమని, వారిని ఈ సందర్భంగా స్మరించుకోవడం మనకు లభించిన గొప్ప అవకాశమన్నారు. ఈ కార్యక్రమంలో పటాలపు సహాయ దళాధిపతి ఎస్డీ. రంగారెడ్డి, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.