'కూటమి మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం'

AP: కూటమి ప్రభుత్వ మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ మీద బురద జల్లి కాలం గడిపేస్తున్నారని, కూటమి సర్కారు ఎప్పుడూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు. విద్యుత్ కొనుగోలులో దాదాపు రూ.11 వేల కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ ఖజానాపై ఎంతో భారం పడిందని మండిపడ్డారు.