తాహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ నేతలు
WGL: రాయపర్తి మండలంలో మొంథా తుపాన్ ప్రభావంతో వరి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంటలతో పాటు చెరువులు, రహదారులు, నివాసాలు కూడా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మండల నాయకులు రాయపర్తి తహసీల్దార్ శ్రీనివాస్‌కు గురువారం కలసి వినతిపత్రం సమర్పించి, నష్టాన్ని పరిశీలించి రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.