VIDEO: సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం
జనగామ జిల్లా కేంద్రంలో మంగళవారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ నగర్ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీ మహిళలు కలిసి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.