ప్రజలకు కలెక్టర్ సూచన

MNCL: బాధిత ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ కుమార్ దీపక్ భరోసా ఇచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో శనివారం లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదవ వార్డులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నీట మునిగిన పలు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.