VIDEO: రంజాన్ వేడుకల్లో పాల్గొన్న పోచారం
KMR: బాన్సువాడ పట్టణంలోని నెక్ బీబీ దర్గా ఈద్గా వద్ద ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. శనివారం పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అఖిలపక్ష నాయకులు పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.