మంగళగిరిలో స్వర్ణకార సంఘం నూతన కమిటీ ఎన్నిక

GNTR: మంగళగిరి నగరం షరాబజార్‌లో శనివారం స్వర్ణకారుల సమావేశం జరిగింది. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గొట్టుముక్కల నాగరాజు, కార్యదర్శిగా బట్టు నారాయణ, ట్రెజరర్‌గా జొన్నాదుల బాలకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంత్రి నారా లోకేష్ సహాకారంతో స్వర్ణకారులకు పలు సంక్షేమ పథకాలు అందేవిధంగా కృషి చేస్తామని నూతన సభ్యులు తెలిపారు.