ఓటమిపై మీడియాకు మొహం చాటేసిన రాహుల్‌

ఓటమిపై మీడియాకు మొహం చాటేసిన రాహుల్‌

బీహార్ ఎన్నికల్లో ఘోర ఓటమిపై కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకుంది. ఈ సమావేశం అనంతరం ఆర్జేడీ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్‌లకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేసి మాట్లాడారు. వీరితో పాటు మహాఘఠ్ బంధన్ కూటమిలోని ఇతర పార్టీల నేతలతోనూ ఓటమిపై చర్చించారు. సమావేశం నుంచి బయటకు వచ్చిన రాహుల్ మీడియాతో మాట్లాడకుండా మౌనంగా వెళ్లిపోయారు.