VIDEO: ఐ లవ్ యు పాతపట్నం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
SKLM: పాతపట్నం మండలం ఎర్రచెరువు వద్ద ఐ లవ్ యు పాతపట్నం చిహ్నం నిర్మాణానికి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శనివారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ కట్టడం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని తెలియజేశారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.