దరఖాస్తులను పునఃపరిశీలించిన సబ్ కలెక్టర్

PPM: ఇంటి స్థలాల కొరకు దరఖాస్తులను పార్వతీపురం సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి పునఃపరిశీలించారు. సోమవారం మక్కువ మండలంలోని కవిరిపల్లి, వెంకటభైరిపురం, మక్కువ గ్రామానికి చెందిన కొందరు తమకు ఇంటి స్థలాలను మంజూరు చేయాలని కోరుతూ ఇదివరకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో వాస్తవాలను తెలుసుకొని, అర్హత గల దరఖాస్తులను పరిశీలించి నివేదిక సిద్ధం చేసే ప్రక్రియలో భాగగా పర్యటన చేశారు.