జిల్లాలో వైరల్ జ్వరాలు విజృంభణ

NLG: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వైరల్ జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. నల్గొండ జిల్లా ఆసుపత్రిలో రోజుకు 500లకుపైగా ఓపీలు నమోదవుతున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం, దోమల బెడదతో టైఫాయిడ్, డెంగీ కేసులు నమోదవుతున్నాయని నివేదికలు తెలుపుతున్నాయి.