ఎస్సైపై దాడి.. కేసు నమోదు

ఎస్సైపై దాడి.. కేసు నమోదు

GNTR: అరండల్ పేటలో నైట్ బీట్ విధులు నిర్వహిస్తున్న ఎస్సై కె. ఏడుకొండలుపై మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. బహిరంగంగా మద్యం తాగి గొడవ చేస్తున్న వారిని వారించగా ఎస్సైపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఆయన చేతికి గాయమైంది. దీంతో అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.