నకిలీ పత్రాలతో భూ దందా.. జలీల్‌పై రైతుల ఆగ్రహం

నకిలీ పత్రాలతో భూ దందా.. జలీల్‌పై రైతుల ఆగ్రహం

GNTR: మంగళగిరి మండలం చిన్నకాకానిలో బుధవారం రౌడీషీటర్ జలీల్ ఆగడాలపై రైతులు ఆందోళన చేపట్టారు. సర్వే నం.182లో 10 ఎకరాలకు నకిలీ పత్రాలు సృష్టించి, సంతకాలు ఫోర్జరీ చేసి విక్రయించారని ఆరోపించారు. తమను బెదిరిస్తున్న జలీల్ ముఠాపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, తమ భూములను కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు.