అబ్రహం లింకన్ షిప్‌పై దాడి జరగలేదు: అమెరికా
అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అబ్రహం లింకన్‌పై ఇరాన్ దాడి చేసినట్లు వస్తున్న వార్తలను అగ్రరాజ్యం కొట్టివేసింది. అబ్రహం లింకన్ షిప్‌పై ఎలాంటి దాడి జరగలేదని, అది పూర్తి సురక్షితంగా ఉందని యూఎస్ స్పష్టం చేసింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు నౌక దరిదాపుల్లోకి కూడా రాలేదని పేర్కొంది. తమ క్షిపణి నిరోధక వ్యవస్థలు వాటిని గాలిలోనే అడ్డుకున్నాయని వెల్లడించింది.