VIDEO: విద్య, వైద్యమే జీవితానికి సార్థకత : ఎస్పీ
MBNR: సమాజంలో విద్య, వైద్యం సరిగ్గా ఉంటేనే మనిషి జీవితానికి సార్థకత లభిస్తుందని మహబూబ్ నగర్ ఎస్పీ జానకి అన్నారు. బోయపల్లి రోడ్డులో జరిగిన పదో తరగతి విద్యార్థుల శిక్షణ శిబిరం ముగింపులో ఆమె పాల్గొన్నారు. సరైన వేదిక లేక వెనుకబడుతున్న పేద విద్యార్థుల చదువు కోసం ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఆమె కొనియాడారు.