'బాధిత కుటుంబానికి అండగా నిలవాలి'

సిరిసిల్ల: ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ఇటీవల వేముల మల్లేశం అనే వ్యక్తి అప్పుల బాధతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. నేడు వారి కుటుంబ సభ్యులను పోచమ్మ యూత్ సభ్యులు పరామర్శించారు. అనంతరం వారికి 50 కిలోల బియ్యం అందజేసి వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. నిరుపేద కుటుంబం అయినందున వారిని దాతలు ఆదుకోవాలని కోరారు.