వేమనపల్లి మండలంలో సోలార్ మెషిన్‌ల దొంగతనం
MNCL: వేమనపల్లి మండలంలో సోలార్ ఫెన్స్ షాక్ మెషీన్ల దొంగతనాలు వరుసగా జరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి పాలే శ్రీనివాస్‌కు చెందిన రూ.12,000 విలువైన మెషీన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. 3నెలల్లో నలుగురు రైతుల పొలాల్లోనూ ఇలాంటి దొంగతనాలు జరిగాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.