ఆర్టీసీ డిపోలో ఉద్యోగాలు
ATP: ఉరవకొండ ఆర్టీసీ డిపోలో దినసరి వేతనంపై పనిచేయడానికి డ్రైవర్‌ల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు డిపో మేనేజర్ హంపన్న ఇవాళ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఆర్టీవో క్లియరెన్స్ సర్టిఫికెట్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో పాటు హాజరుకావాలన్నారు. అనంతరం వైద్యపరీక్షలో ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందిన వారినే ఎంపిక చేస్తామని తెలిపారు.