'క్రీడల అధికారిగా మహమ్మద్ అక్బర్ అలీ'

NLG: జిల్లా యువజన క్రీడల అధికారిగా మహమ్మద్ అక్బర్ అలీ ఇవాళ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాను క్రీడలలో రాష్ట్రంలోనే అగ్రగామిగా తయారు చేయడానికి అన్ని క్రీడా వ్యవస్థలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు.