ఘనంగా భగవాన్ బిర్సా ముండా జయంతి
PDPL: మెట్‌పల్లిలో ఎబీవీపీ ఆధ్వర్యంలో భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. నాయకులు మాట్లాడుతూ.. జల్, జంగిల్, జమీన్ తత్వానికి పునాదివేసిన ఆదివాసి వీరుడు బిర్సా ముండా అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ మంగళపల్లి మారుతి, సాయికుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.