రాకొండలో సర్పంచ్ అభ్యర్థిపై కత్తితో దాడి

రాకొండలో సర్పంచ్ అభ్యర్థిపై కత్తితో దాడి

VKB: దోమ(M) రాకొండలో దారుణ ఘటన జరిగింది. స్థానిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా అర్జున్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కడుపులో మూడు చోట్ల బలమైన గాయాలు కాగా, అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ముసుగు వేసుకుని వచ్చి దాడి చేశాడని అర్జున్ పేర్కొన్నాడు. బాధితుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.