"జిల్లా కేంద్రంలో డీఎస్సీ కోచింగ్ సెంటర్"

సత్యసాయి: రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో డీఎస్సీ కోచింగ్ సెంటర్లను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి సవిత పేర్కొన్నారు. శుక్రవారం పెనుకొండ మండలంలోని రాంపురం గ్రామంలో మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రారంభోత్సవ సభలో మంత్రి మాట్లాడారు. సత్యసాయి, అనంతపురం జిల్లా కేంద్రాల్లోనూ డీఎస్సీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.