భారీ వర్షంతో నేలకొరిగిన వరి చేలు

భారీ వర్షంతో నేలకొరిగిన వరి చేలు

SKLM: వంగర మండలంలో పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలులతో పాటు భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల పండ్ల, కూరగాయల తోటలు, నువ్వు, పెసర పంట చేలు దెబ్బతిన్నాయి. కోత కోసిన వరిచేలు మునిగిపోగా, కోతకు సిద్ధంగానున్న చేలు నేలకొరిగి వర్షం నీటిలో ముంపునకు గురికావడంతో వరి రైతు తీవ్ర నష్టాలకు గురయ్యారు.