సూర్యాపేటలో ఘనంగా భోగి మంటలు వేడుకలు
సూర్యాపేట జిల్లా 19వ వార్డులో భోగి మంటలు వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించబడ్డాయి. కాంగ్రెస్ పార్టీ నేత దారోజు భాగ్యరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోగి మంటలకు మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ షేక్ గౌస్, ఎర్ర పృథ్వీ రెడ్డి, సోమేశ్ గౌడ్, పురుషోత్తం ఎర్ర ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.