మనో ధైర్యాన్ని కోల్పోవద్దు: ఛైర్మన్
NLG: ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్యకు నిరసనగా నల్గొండ జిల్లా దేవరకొండలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ ఛైర్మన్ విరుగదిండ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు ధైర్యం కోల్పోవద్దని, 32 న్యాయపరమైన డిమాండ్ లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది కార్మికులు పాల్గొన్నారు.