అర్హులందరికీ అన్నదాత సుఖీభవ: MLA
SKLM: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అన్నదాత సుఖీభవ పథకం అందేలా చర్యలు చేపట్టాలని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. ఇవాళ ఆయన క్యాంపు కార్యాలయంలో ఐదు మండలాల అధికారులతో సమావేశం నిర్వహించారు. రేపు ఈ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో కలిపి మొత్తం రూ.7 వేలు లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరగనుందని తెలిపారు.