సీపీఐ రాష్ట్ర మహాసభల కోసం విరాళాల సేకరణ

సీపీఐ రాష్ట్ర మహాసభల కోసం విరాళాల సేకరణ

ప్రకాశం: ఒంగోలులో ఈనెల 20 నుంచి 25వ తేదీ వరకు సీపీఐ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ సీపీఐ నాయకులు కనిగిరిలో ఆదివారం ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా మహాసభల కోసం స్థానిక ప్రజల నుంచి విరాళాలను సేకరించారు. కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గ సీపీఐ సహాయ కార్య దర్శి మోహన్, కార్యకర్తలు పాల్గొన్నారు.