ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు ఇవే..!

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు ఇవే..!

NLG: దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఇవాళ(మార్చి 21) నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు ఈద్గాలో రంజాన్ ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం గౌరికుంట తండా, బాలాజీ నగర్, కేశంనేని పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ వేడుకలకు హాజరవుతారు. అలాగే చిన్నఅడిశెర్ల పల్లిలో పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవం, గుంటిమడుగులో బ్రహ్మోత్సవ పూజల్లో పాల్గొంటారు.