VIDEO: సైకో వీరంగం.. పోలీసులకు ముప్పుతిప్పలు

VIDEO: సైకో వీరంగం.. పోలీసులకు ముప్పుతిప్పలు

విశాఖపట్నం-గంగవరంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని దొంగిలించి రోడ్డుపై వెళ్తున్న కారు, ఆటోలను ఢీకొంటూ భయబ్రాంతులకు గురిచేశాడు. అనంతరం సమీపంలోని చెరువులోకి దూకి గంటల తరబడి బయటకు రాకుండా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చెరువులోకి దిగి అతడిని బంధించి బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.