ఆస్తులు పంచుకొని తల్లితండ్రులను గెంటేసిన పిల్లలు

HNK: కాజీపేటకు చెందిన నారాయణ, శాంతమ్మలకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పాల వ్యాపారం చేసి ముగ్గురు కుమార్తెలకు ఘనంగా పెళ్లిళ్లు చేశారు. 10 ఎకరాల భూమితో పాటు ఇంటి స్థలాన్ని కుమారులకు సమానంగా పంచారు. అమ్మానాన్నలను రేకుల షెడ్డులో వదిలేశారు. ఆసుపత్రులకు తీసుకెళ్లమంటే ఇబ్బందులు పెడుతున్నారని కలెక్టర్ ప్రావీణ్యను వేడుకున్నారు.