అరెస్ట్‌లతో మా పోరాటం ఆగదు: మాజీ మంత్రి హరీష్ రావు
HYD: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. BRS నాయకులను హౌస్ అరెస్టులు చేసి అడ్డుకున్నా ఆగబోమని, పరిగి ఇండస్ట్రియల్ పార్క్ భూ బాధితులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. 'మమ్మల్ని అరెస్టులతో భయపెట్టలేరు.. రైతుల తరఫున మా పోరాటం ఆగదు' అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. అక్రమ అరెస్టులకు భయపడే పార్టీ బీఆర్ఎస్ కాదని పేర్కొన్నారు.