చేవెళ్లలో మహాత్మజ్యోతి రావ్ పూలే జయంతి

RR: మహాత్మజ్యోతి రావు పూలే 198వ జయంతి సందర్భంగా చేవెళ్ల పట్టణంలోని పూలే విగ్రహానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య పూలమాలవేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... మహాత్మ జ్యోతి రావు పూలే గొప్ప సంస్కర్త అని, ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు. పూలే సామాజిక కట్టుబాట్లను ఎదిరించి, కుల వ్యవస్థను నిర్మూలించేందుకు కృషి చేశారన్నారు.