కుసుమకు పీహెచ్.డీ ప్రదానం
తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగానికి చెందిన కందాటి కుసుమ పీహెచ్.డీ పట్టాను సాధించారు. సిస్‌ప్లాటిన్ ఔషధం వల్ల కలిగే బహుళ అవయవ విషతుల్యతపై ప్రోబయోటిక్స్ రక్షణాత్మక పాత్రను ఆమె పరిశోధనలో విశదీకరించారు. ఈ పరిశోధనను ప్రొఫెసర్ డా. ఎన్. జాన్ సుష్మా మార్గదర్శకత్వంలో 2026 ఏప్రిల్ 7న విజయవంతంగా పూర్తి చేశారు.