గ్యాస్ సిలిండర్ల స్వాధీనం చేసుకున్న పోలీసులు
W.G: తణుకు మండలం పైడిపర్రులో అక్రమంగా నిల్వ ఉంచిన రాయితీ గ్యాస్ సిలిండర్లను ఇవాళ విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పైడిపర్రులోని గవర వెంకటేశ్వరరావు ఇంట్లో గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉన్నట్లు వచ్చిన సమాచారంతో జిల్లా ఎస్పీ నాగేశ్వరరావు ఆదేశాలతో విజిలెన్స్ సీతారామ్ ఆధ్వర్యంలో ఈ దాడి చేశారు. 35 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.