VIDEO: నడిరోడ్డుపై మహిళను కొట్టిన జనసేన కార్యకర్త
అన్నమయ్య: జనసేన MLA అరవ శ్రీధర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళపై ఆయన అనుచరుడు దాడి చేశారు. MLAతో పాటు వారంతా నిన్న 'అమరావతి' సంబరాల కోసం రైల్వేకోడూరులోని రోడ్డుపైకి వచ్చారు. మహిళ కూడా అక్కడికి రావడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. MLA సమక్షంలోనే ఓ కార్యకర్త పోలీసుల చేతిలో లాఠీ లాక్కొని ఆమెను కొట్టాడు. న్యాయం చేయాలని కోరితే దాడి చేశారని మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.