ఆలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

ఆలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

E.G: కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో శ్రీపర్వత వర్ధిని సహిత ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ శనివారం ఘనంగా జరిగింది. ఈ ఆలయ నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులతోపాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.