మద్యం దుకాణం ఖరీదు రూ. 92 లక్షలు..!
NGKL: మద్యం వ్యాపారంలో లాభాలు అర్జిస్తున్న కొంతమంది వ్యాపారులు ఎంత డబ్బైనా వెచ్చించి మద్యం షాపులను కొనుగోలు చేస్తున్నారు. కల్వకుర్తిలో ఒక్క మద్యం దుకాణం ఖరీదు రూ. 92 లక్షలు ధర పలికింది. టెండర్‌లో మద్యం దుకాణం దక్కించుకున్న వారు వాటిని ఇతర వ్యాపారులకు విక్రయిస్తున్నారు. కల్వకుర్తిలో రెండు మద్యం దుకాణాలను ఒక్కొక్కటి రూ. 92 లక్షల చొప్పున కొనుగోలు చేశారు.