14న ఉచిత నేత్ర వైద్య శిబిరం

VZM: గజపతినగరంలోని గంగరాజు థియేటర్ ఎదురుగా ఉన్న నేత్రాలయ ఐ కేర్ వద్ద ఈనెల 14వ తేదీన సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి రేవంత్ శనివారం తెలిపారు. శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో జరగనున్న ఈ శిబిరంలో నేత్ర రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.