మెనూ తప్పనిసరిగా పాటించాలి: కలెక్టర్

SDPT: దౌల్తాబాద్ మండల కేంద్రంలోని జడ్పీ బాలికల పాఠశాలను కలెక్టర్ హైమావతి ఆకస్మిక సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం వెజిటబుల్ కర్రీ, సాంబారు, గుడ్డు వండుతున్నట్లు సిబ్బంది తెలిపారు. విద్యార్థులకు రుచికరంగా వండాలని, మెనూ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. పదవ తరగతిలో సాంఘిక శాస్రంలో డిజిటల్ క్లాస్‌లలో రాష్ట్రాల గుర్తించే ప్రక్రియని పరిశీలించారు.