ఎస్కేయూ పీజీ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు
ATP: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ)లోని వివిధ పీజీ కోర్సుల్లో మిగిలిన సీట్లను తక్షణ ప్రవేశాల ద్వారా భర్తీ చేయనున్నట్లు అడ్మిషన్స్ డైరెక్టర్ ఆచార్య నరసింహన్ తెలిపారు. ఈ నెల 8న ఉదయం 10 గంటల నుంచి అడ్మిషన్లు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. పీజీసెట్‌లో అర్హత సాధించిన లేదా పరీక్ష రాయని విద్యార్థులు కూడా ఈ ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు.