డ్యూటీ అయిపోయిందని ట్రైన్ మధ్యలోనే ఆపేశాడు

డ్యూటీ అయిపోయిందని ట్రైన్ మధ్యలోనే ఆపేశాడు

బీహార్ కిషన్‌గంజ్ జిల్లాలో ఓ లోకో పైలట్ చేసిన పనితో రైల్వే రూల్స్ చర్చనీయాంశమయ్యాయి. తన డ్యూటీ 9 గంటలు అయిపోయిందని, నిబంధనల ప్రకారం విశ్రాంతి అవసరం అంటూ.. మాల్డా-సిలిగురి రైలు(DEMU- 75719)ను స్థానిక ఠాకూర్ గంజ్ స్టేషన్‌లో 3 గంటలపాటు నిలిపేశాడు. దీంతో వ్యాపారులు, రోజువారీ కూలీలు సహా వందల మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.