గ్రంథాలయంలో ఘనంగా సీఆర్ రెడ్డి జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల గ్రంథాలయంలో సీఆర్ రెడ్డిగా ప్రసిద్ధుడైన డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి గ్రంధాలయ అధికారిని అమరేశ్వరి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యం, విద్యాగంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు.