విచారణకు హాజరైన యాంకర్ శ్యామల
KRNL: చిన్నటేకూరు బస్సు ప్రమాదంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాల కేసులో విచారణకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యాంకర్ శ్యామల సోమవారం కర్నూలుకు వచ్చారు. జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డితో కలిసి డీఎస్పీ కార్యాలయంలో హాజరయ్యారు. ఈ కేసులో మొత్తం 27 మందికి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.