మియాపూర్‌లో చైన్ స్నాచర్ అరెస్ట్

మియాపూర్‌లో చైన్ స్నాచర్ అరెస్ట్

RR: మియాపూర్ పోలీసులు చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేశారు. గత నెలలో జేపీ నగర్ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును లాకెళ్లిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన బ్రిజేష్ చౌహాన్(20)ను సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి 26 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.